విదేశాలో కూచిపూడి నృత్య శోభ!

kuchipudi-dance
kuchipudi-dance

అమెరికా: అమెరికా, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశమేగినామన భారతీయ సంస్కృతిని మన సంప్రదాయాల్ని మరువక పోవడమే కాదు వారి పిల్లలకి సుశిక్షణనిచ్చి ముందు తరాలకి భారతీయతను అందచేయడం ఎంతైనా ముదావహం. కూచిపూడి, భరతనాట్యం, కథక్ వంటి సాంప్రదాయ నృత్యాలు కర్ణాటక, హిందుస్తానీ వంటి సాంప్రదాయ సంగీతాలు నేర్పే సంగీత, నృత్య కళాకేంద్రాలు అట్లాంటా, న్యూజెర్సీ, చికాగో, సెయింట్ లూయిస్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి నగరాల్లో కోకొల్లలు. తానా, నాట్స్, నాటా, ఆటా వంటి జాతీయసంస్థలు సుప్రసిద్ధ కళాకారులతో పాటు వర్ధమాన కళాకారులకి వారి వారి ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించడానికి వేదికలు కల్పిస్తాయి. సహస్ర ససిపల్లి, శాన్వి కుంటమల్ల, నిధి నిహారిక చెన్నంపట్టు మని పది సంవత్సరాల వయస్సువారు కానప్పటికీ కూచిపూడి నృత్యంలో ఇప్పటికే చక్కని అభినవేశం చూపుతున్న చిన్నారులు. చికాగాలో నాట్స్, సెయింట్ లూయిస్ పట్టణంలో తానా నిర్వించిన తెలుగుసంబరాల్లో ఈ చిన్నారులు నృత్యప్రదర్శనలిచ్చారు.

శ్రీగౌరీ శంకర్ మరియు శ్రీమతి జాహ్నవిల కుమార్తె సహస్ర ససిపల్లి, శ్రీ ప్రవీణ్ కుంటమల్ల మరియు శ్రీమతి సుష్మితల కుమార్తె శాన్వి కుంటమల్ల అలాగే శ్రీ రాజశేఖర్ మరియు శ్రీమతి ఇందిరా ప్రియదర్శనిల కుమార్తె నిధి నిహారిక చెన్నం. 1982 లో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి పట్టణంలో ప్రారంభమై ఇప్పుడు టేనస్సీ రాష్ట్రం లోని మెంఫిస్ మహా పట్టణంలో కొనసాగుతున్న సాంప్రదాయ సంగీత, నృత్య శిక్షణాలయం ఖిఇండియన్ బాలే థియేటర్ఖి లో ఈ చిన్నారు ప్రముఖ కూచిపూడి నృత్య గురువులైన శ్రీమతి చంద్ర ప్రభ మరియు డాక్టర్రమణ వాసిలి వద్ద గత మూడు సంవత్సరాలుగా కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తున్నారు. ఈ చిన్నారులు ఇప్పటి వరకు దాదాపు 30 పైగా నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/