సీఐఐ తెలంగాణతో కెటిఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ఒక్కరిని కూడా ఉద్యోగంలోంచి తొలగించ వద్దని విజ్ఞప్తి

ktr
ktr

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ ఈ రోజు భారత పరిశమ్రల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ చాఫ్టర్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకోన్న పరిస్థితుల కారణంగా సూక్ష్మ, మధ్య తరహ పరిశ్రమలు ఎదుర్కోంటున్న సమస్యలపై చర్చించారు. కరోనా కారణంగా సంస్థల్లొ పనిచేసే ఏ ఒక్క ఉద్యొగిని కూడా తొలగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఉద్యోగుల భధ్రత కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. పరిశ్రమల పున: ప్రారంభంపై కూడా చర్చించినట్లు మంత్రి ట్వీట్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/