లివింగ్ లెజెండ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు..కెటిఆర్
నిత్య స్ఫూర్తిప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు కవిత
CM KCR and Minister KTR
హైదరాబాద్: సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్ చెబుతూ ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం చేసేందుకు అన్ని అవరోధాలను ఎదురించిన పోరాట ధీరుడాయన. ప్రేరణాత్మక ఉద్యమాలతో అసాధారణ నేతగా ఆవిర్భవించిన వ్యక్తి.. ఇప్పుడు ఓ అసామాన్య పరిపాలకుడు.. విజినరీ అన్న పదానికి మహోన్నత ఉదాహరణగా నిలిచే లివింగ్ లెజెండ్ ఆయన. ఆ అపూర్వమైన వ్యక్తిని నాన్న అని సగర్వంగా పిలుస్తానంటూ కెటిఆర్ మనవరాలు అలేఖ్యతో కలిసి కెసిఆర్ దిగిన ఫోటోను కెటిఆర్ ట్వీట్ చేస్తూ ముఖులిత హస్తాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.
మరోవైపు నా జన్మదాతకు, నిత్య స్ఫూర్తిప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు అని కవిత ట్వీట్‌లో పేర్కొన్నారు.