కేసీఆర్ ప్రెస్ మీట్ ఫై కేటీఆర్ ట్వీట్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో మీడియా తో దాదాపు రెండున్నర గంటల సేపు మాట్లాడాడారు. ముందుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల ఫై సమీక్షా చేసిన కేసీఆర్..ఆ తర్వాత మోడీ సర్కార్ ఫై నిప్పులు చేరగడం మొదలుపెట్టారు. ప్రతి అంశంఫై సుదీర్ఘంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎనిమిదేళ్ల బిజెపి సర్కార్ తీరు , వైఫల్యాలు, డబుల్ ఇంజిన్ సర్కారు, రూపాయి పతనం, నుపుర్ శర్మ అంశం, అగ్నిపథ్ పథకం , ఏక్‌నాథ్ షిండేలను తయారు చేయడం, బ్లాక్ మనీ , అలాగే జాతీయ రాజకీయాల ఫై తన ఎంట్రీ, ఇలా ప్రతి అంశంపైనా కేసీఆర్ తనదైన రీతిలో స్పందించారు.

అలాగే టీఆర్ఎస్ జాతీయ‌పార్టీగా మారితే త‌ప్పేముంది?.. దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. టీఆర్ ఎస్ పెట్టిన‌ప్పుడు విమ‌ర్శించినోళ్లు ఇప్పుడేడున్న‌రు? అని అడిగారు. దేశ‌మేమ‌న్నా బీజేపీ నాయ‌కుల‌కు రాసిచ్చామా? అని ప్ర‌శ్నించారు. వీళ్లు దేశానికి చేసిందేంట‌ని నిల‌దీశారు. ఇక మీడియా అడిగిన ప్రశ్నలకు సమాదానాలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నేతల తీరు ఫై కూడా పలు సెటైర్లు , కామెంట్స్ చేసారు. ఇక కేసీఆర్ స్పీచ్ ఫై ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసారు.

‘‘మీరు అంగీకరించొచ్చు లేదా అంగీకరించకపోవచ్చు కానీ.. పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లు అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ఈరోజు ఆయన రెండున్నర గంటలపాటు నిర్వహిచిన మారథాన్ ప్రెస్ మీట్ కూడా ఈ కోవకే చెందుతుంది’’ అని కేటీఆర్ ట్వీట్ చేసారు. అలాగే ప్రధాని మోడీ పైనా కేటీఆర్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా మీడియాను ఎదుర్కోని నేతలు కూడా ఉన్నారంటూ ఆయన సెటైర్లు సంధించారు.