ఢిల్లీలో నీటి సమస్య ఫై కేటీఆర్ ట్వీట్

దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్య విలయతాండవం చేస్తుంది. చుక్క నీటి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మంత్రి అతిషి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా కు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ లేఖలో ప్రధాన పైపులైన్లకు భద్రతను కల్పించాలని అతిషి కోరారు. ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొనడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు పలువురు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ నీటి పారుదల శాఖ మంత్రి అతిషి అన్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ నీటి సమస్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “భారతదేశంలో పొలిటికల్ సక్సెస్ అంటే నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు వంటి సమస్యలు తీర్చడం కాదు. ఇమాజినరీ ఇష్యూలు, ఊహాజనిత సమస్యలు, అవగాహనలు నిర్మించి ఎన్నికలు గెలిచినప్పుడు వాస్తవ సమస్యలపై పని చేయడానికి రాజకీయ పార్టీలకు ప్రోత్సాహం ఎక్కడ ఉందని ప్రశ్నించారు కేటీఆర్. వారు చెప్పినట్లే ఏదైతే అదే కానివ్వండి” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.