నవంబరు 1న హుజుర్‌నగర్‌ లో కెటిఆర్‌ పర్యటన

ktr
ktr

హైదరాబాద్‌: హుజర్‌నగర్‌ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి ఘనవిజయం సాధించిన తర్వాత కెసిఆర్‌ హుజుర్‌నగర్‌ వెళ్లి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ కృతజ్ఞత సభలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు చేపట్టాలని నిర్ణయించారు. కృతజ్ఞత సభలో పలు హామీలు ఇచ్చారు. ఈ హామిలను నేరవేర్చటానికి టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పలు అభివృద్ది పనులకు శంకు స్థాపన చేయాలని నవంబర్‌ ఒకటిన హుజుర్‌నగర్‌ వెళ్లనున్నారు. హుజుర్‌నగర్‌ నియోజక వర్గంలో చేపట్టాలి వలసిన పనులు గురించి మంత్రి జగదీశ్‌ రెడ్డి ఎమ్మెల్యె శానంపూడి సైదిరెడ్డి, పలువురు నేతలతో హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక పార్టీ ఇన్‌చార్జిగా పనిచేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్యర్‌ రెడ్డి, భువనగిరి జడ్పీ చైర్మెన్‌ సందీప్‌ రెడ్డి, పార్టీ కార్మిక విభాగం రాష్ట్రం అధ్యక్షుడు రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌ కెటిఆర్‌ను కలిసారు వారందరిని కెటిఆర్‌ అభినందించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/