హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్..రేపు ఏం జరగబోతుంది..?

మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు రేపు ఎమ్మెల్సీ కవిత ను విచారించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ సాయంత్రం పార్టీ విసృతస్థాయి సమావేశం ముగియగానే ఢిల్లీకి పయనమయ్యారు. ఈడీ విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పయనమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు, ముఖ్యనేతలు కూడా ఢిల్లీ బయల్దేరారు. కేటీఆర్ అక్కడికి చేరుకున్నాక కవిత, లీగల్ టీమ్ తో భేటీ కానున్నారు. రేపు, ఎల్లుండి కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారని తెలుస్తోంది.

నిన్న కవిత ఢిల్లీ బయల్దేరి వెళ్లే ముందు సుమారు 15 నిమిషాల పాటు కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కవితకు ధైర్యం చెప్పి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని ఢిల్లీ పంపారు కిష . ఇప్పుడు చెల్లి కవితకు బాసటగా నిలిచేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే ఈ కేసులో ముందుకెళ్దాం..? అనేదానిపై బీఆర్ఎస్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని అంత మాట్లాడుకుంటున్నారు. ఇక లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 8నే విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు పంపడం తెలిసిందే. అయితే తనకు ఈ నెల 9, 10వ తేదీల్లో వేరే షెడ్యూల్ ఉండడం వల్ల 11వ తేదీన విచారణకు వస్తానని కవిత ఈడీకి బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె రేపు (మార్చి 11)న ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.