జగన్ ఫై పట్టాభి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన కేటీఆర్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై తెలుగుదేశం నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల ఫై అంత విమర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం తప్పు పట్టారు. హుజరాబాద్ ఉప ఎన్నిక తదితర అంశాలపై కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఏపీ సీఎం ను పట్టుకుని ఆ బూతులు ఏంటి అని వ్యాఖ్యానించారు.

టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడిని పక్కన పెడితే దానికి మూలం ఎక్కడ ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అసహనం ఎందుకు అని.. నువ్వు ఓడిపోయావు ఐదేళ్ల తర్వాత మళ్లీ జనం లోకి వెళ్ళు బతిమిలాడుకో నీకు ఎందుకు ఓటు వేయాలో వివరించు.. అర్జెంట్గా అధికారంలోకి రావాలన్న ఆరాటం ఎందుకని ప్రతిపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో డిగ్నిటీ ఉండాలని కేటీఆర్ హితవు పలికారు.

మరోపక్క సీనియర్ రాజకీయ నేతలు సైతం చంద్రబాబు చేపట్టిన దీక్ష ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టాభి మాటలను పక్కన పెట్టి కార్యాలయాలపై దాడి చేయడం గురించి దీక్ష చేపట్టడం ఏంటి..? పట్టాభి ని అదుపులో పెట్టుకునే సరిపోయేది కదా..? ప్రజల కష్టాల ఫై దీక్షలు చేస్తే బాగుండేది కానీ బూతులు తిట్టిన వాడికి సపోర్ట్ గా దీక్ష చేయడం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు.