నాగార్జునసాగర్ ప్రజలకు తీపి కబురు తెలిపిన మంత్రి కేటీఆర్

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు మంత్రి కేటీఆర్. శనివారం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కాలం పదవిలో ఉన్న నేతలు చేయని అభివృద్ధి ఈరోజు ఎమ్మెల్యే భగత్ చేస్తున్నారు. సాగర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధి కి కారణమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. నందికొండ, హాలియా లో డిజిటల్ లైబ్రరీ, ఆధునిక బస్ స్టాండు, ఆడిటోరియం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రోడ్లు వెడల్పు, డ్రైనేజీ… వాకింగ్ ట్రాక్..వైకుంఠ ధామం లకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

వ‌రంగ‌ల్ స‌భ‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని అడిగిన విష‌యాన్ని కేటీఆర్ గుర్తు చేస్తూ నిప్పులు చెరిగారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన పెద్దాయ‌న‌కు ఎన్నిసార్లు అవ‌కాశం ఇచ్చారు. ఏడు సార్లు అవ‌కాశం ఇచ్చినా ఏం ఉద్ధ‌రించ‌లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి 10 సార్లు అవ‌కాశం ఇచ్చారు.. 50 ఏండ్లు వారే ప‌రిపాలించారు. 50 ఏండ్లు ఏం చేయ‌లేనోడు.. ఇంకొక్క చాన్స్ ఇవ్వండని అడుగుతుండు. రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ కాదు.. అది కాంగ్రెస్ నేత‌లు ఒక‌రికొక‌రు త‌న్నుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను అయోమ‌యానికి గురి చేసే దిక్కుమాలిన క‌థ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.