ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీలో కెటిఆర్‌

ktr
ktr

సిరిసిల్ల: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పింఛన్ల ఉత్వర్వుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పింఛను అర్హత వయస్సు తగ్గింపు కూడా జూన్‌ నెల నుంచే వర్తిస్తుందని వెల్లడించారు. బీడీ కార్మికులకు పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని తగ్గించడంతో కొత్తగా 2 లక్షల మందికి పింఛను అందుతుందన్నారు. 17 శాతం వృద్ధిరేటుతో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని గుర్తు చేశారు. గృహనిర్మాణాల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఇళ్ల కోసం ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని అన్నారు. ఆశావహులు ఎక్కువగా ఉన్న చోట లాటరీ తీసి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/