పురపాలక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం

ktr
ktr

హైదరాబాద్ : పూర్వ రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలోని పురపా లక సంఘాల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజ యం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా ల ఎంఎల్‌ఎలు, పార్టీ శ్రేణులతో కెటిఆర్ సమావే శమయ్యారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఈ సమా వేశంలో సమీక్షించారు.సందర్భంగా రానున్న పురపాలక ఎన్నికలకు సంబంధించిన పార్టీ కార్యాచరణను వివరించారు. ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీపరంగా తీసుకోవాల్సిన కార్యాచరణపైన స్థానిక మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పార్టీ సీనియర్ నాయకులతో చర్చించారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, దానం నాగేందర్, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపి రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/