వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్న కెటిఆర్‌

నేటి నుంచి 24 వరకు జరిగే 50వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్న మంత్రి కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్: రాష్ట్ర ఐటి,పరిశ్రమలు,మున్సిపాలిటీ శాఖ మంత్రి కెటిఆర్‌ స్విట్జర్‌లాండ్‌లోని దావోస్‌కు చేరకున్నారు. 20వ తేదీ నుంచి 24వ తేదీవరకు జరగనున్న 50వ వరల్డ్‌ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా కెటిఆర్ పాల్గొననున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే ప్రత్యేకంగా కెటిఆర్ ను ఆహ్వానించారు. ప్రపంచంలోనే అత్యంతప్రతిష్ఠాత్మకమైన ఈ సదస్సును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించనున్నారు. అలాగే ఈ సదస్సులో బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, జర్మని ఛాన్షలర్ ఎంజెలా, ఆప్ఘన్‌కు చెందిన ఘని, పాకిస్తాన్ ప్రధాన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్,చైనా నుంచి హాన్‌జెంగ్, ఇటలీ ప్రధానమంత్రి, ఆస్ట్రేలియా ఛాన్షలర్ సెబాస్టిన్‌కుర్జ్, కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్‌తో పాటు ప్రపంచంలోని పలుదేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొనున్నారు.

వీరితో పాటు ప్రపంచదేశాల ప్రముఖ పారిశ్రామికపెట్టుబడిదారులు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. దేశం నుంచి కేంద్రమంత్రులు, పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొననున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. భారత దేశం నుంచి సదస్సుకు హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేసుకున్న పారిశ్రామిక వేత్తల్లో గౌతమ్ అదాని,రాహుల్ సంజీవ్ బజాజ్,కుమార మంగళం బిర్లా,టాటాగ్రూపుకు చెందిన ఎన్.చంద్రశేఖరన్, ఉదయ్ కోటక్,ఎస్‌బిఐ నుంచి రజనీష్‌కుమార్, ఆనంద్ మహేంద్ర,సునీల్ పరేఖ్, ఫిరోజ్ గోద్రెజ్ తదితరులు ఉన్నారు. ప్రపంచవ్యాపంగా పలుప్రసిద్ధకంపెనీలనుంచి 100 మంది సిఇఒలు, 3,000ల మంది ప్రతినిధులు ఈసదస్సులో పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన కెటిఆర్ 21వ తేదీన 4వ పారిశ్రామిక విప్లవం సాంకేతిక ప్రయోజనాలు అందులోని సవాళ్లపై ప్రసంగిస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/