చేపల పెంపకందారులకు కేటీఆర్ అభినందనలు

ktr
ktr

హైదరాబాద్ : రాష్ట్ర మత్స్యశాఖ అధికారులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. చేపల ఉత్పత్తిలో 3 లక్షల టన్నుల మైలురాయి దాటడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మత్స్యశాఖ అధికారులు, చేపల పెంపకందారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ, మార్కెటింగ్ సదుపాయం వల్లే ఇది సాధ్యమైందని కేటీఆర్ చెప్పారు.