దుబాయ్ లో తెలంగాణ యువతి కష్టాలు…స్పందించిన కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పొట్టకూటికోసం దుబాయ్ వెళ్లిన ఓ యువతి వీడియోను చూసి స్పందించారు. దుబాయ్ వెళితే డబ్బులు సంపాదించుకోవచ్చని వెళ్లిన ఓ యువతి, అక్కడ తానున్న ఇంట్లో అష్టకష్టాలూ పడుతోంది. ఎలాగోలా ఓ సెల్ ఫోన్ సంపాదించి, తన కష్టాలను వీడియో తీసి బంధుమిత్రులకు పంపితే, అది టీఆర్ఎస్ నేత కెటిఆర్‌కు చేరింది. దీంతో కెటిఆర్‌ వెంటనే స్పందించి దుబాయ్‌ లోని భారత రాయబారి నవదీప్‌ సూరిని ట్యాగ్ చేస్తూ విషయాన్ని తెలిపారు. బాధిత మహిళ క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన రాయబారి, ఆమె ఆచూకీ కోసం చర్యలు చేపడతామంటూ ట్విట్టర్‌ లో సమాధానమిచ్చారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/