కుమ్మక్కువల్లే కవిత ఓడిపోయారు

ఈ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్‌ కనబడింది

ktr, kavitha
ktr, kavitha

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్ల శాతం పెరిగినా 9 సీట్లే గెలిచామని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 శాతం ఓట్లతో 11 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్నామన్నారు. అయితే ఈ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్‌కనబడిందన్నారు.పార్టీలో అందరూ బాగా కష్టపడినా ఫలితం మాత్రం ఇలా వచ్చిందన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన 3 సీట్లలో రెండు సీట్లను స్వల్ప తేడాతోనే గెలిచిందన్నారు. ఏపి ఫలితాలు టిఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ కాదన్నారు. మోడి అభ్యర్థిత్వమే బిజెపికి ఓటింగ్‌ను పెంచిందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. అయితే హరీశ్‌రావును ఈ ఎన్నికల్లో పక్కన పెట్టామనేది నిజం కాదు. మెదక్‌లో మంచి ఆధిక్యం వచ్చినా.. సిద్దిపేటలో కూడా మెజార్టీ తగ్గిందన్నారు. నిజామాబాద్‌లో కవిత ఓటమికి రైతులు కారణం కాదు. అక్కడ నామినేషన్లు వేసింది రైతులు కాదు.. రాజకీయ కార్యకర్తలే. జగిత్యాల నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్‌ నేత ఇంటి నుంచి 93 మంది నామినేషన్లు పడ్డాయి. కాంగ్రెస్‌, భాజపా కుమ్మక్కువల్లే కవిత ఓడిపోయారు. నేను, కవిత అనేక డక్కామొక్కీలు తిన్నాం. ఒక్క ఓటమితో కుంగిపోం. తెలంగాణ ఏపీ మధ్య సత్సంబంధాలు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగి ఉంటే టిఆర్‌ఎస్‌ కు నష్టం అనే దానితో ఏకీభవించను. ఒడిశాలో రెండు ఎన్నికలు కలిపి వచ్చినా అక్కడ నవీన్‌ పట్నాయక్‌ గెలిచారు అని కెటిఆర్‌ స్పష్టంచేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/