పార్టీ ప్రధానకార్యదర్శులతో కెటిఆర్‌ సమావేశం

ktr
ktr

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కెటిఆర్ పార్టీ నేతలకు సూచించారు. ఇప్పటికే కమిటీల ఏర్పాటు పూర్తి కావొచ్చిందని వారు కెటిఆర్ దృష్టికి తెచ్చారు. ఈనెల 31వ తేదీలోగా అన్ని స్థాయిల కమిటీలను ఏర్పాటు చేసి సెప్టెంబర్ 1వ తేదీ నాటికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కెటిఆర్ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. పార్టీ సభ్యత్వాలతో పాటు కమిటీల ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కెటిఆర్ సూచించారు. నియోజకవర్గ పార్టీ సమావేశాల తేదీలను సైతం పార్టీ అధిష్టానానికి అందించాలి కెటిఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ కార్యాలయాల నిర్మాణంపై కూడా కెటిఆర్ సమీక్ష చేశారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని ఆయన చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/