తెలంగాణకు మరోసారి కేంద్రం మొండిచెయ్యి చూపించిందని కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్రం కు మరోసారి కేంద్రం మొండిచెయ్యి చూపించిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణకు బల్క్ డ్రగ్స్ పార్క్‌ను కేటాయించాలని డిమాండ్ చేసిన కేటీఆర్.. ఈ మేరకు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని పేర్కొన్నారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని కేంద్రం కావాలనే విస్మరించిందన్నారు.
కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలంటే కనీసంగా మూడేళ్లు పడుతుందని తెలిపారు. అన్ని సిద్దంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని పరిగణనలోకి తీసుకుపోకపోవడం.. ఫార్మా రంగాన్ని అత్మనిర్భరత దిశగా స్వయం సమృద్ధి చేయాలన్న లక్ష్యం పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతలేమికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.