హైదరాబాద్ లో 2072 వరకు తాగునీరుకు ఏ ఇబ్బంది లేదు – కేటీఆర్

హైదరాబాద్ లో 2072 వరకు తాగునీరుకు ఇలాంటి ఇబ్బంది లేదన్నారు మంత్రి కేటీఆర్. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంఖిశాలలో 1450 కోట్ల వ్యయంతో జంటనగరాలకు తాగునీరు అందించే ఇంటేక్ వెల్ కు, సుంకిశాల నుండి 17కిలో మీటర్ల దూరంలో ఉన్న కొదండాపూర్ లో నిర్మించే పంపింగ్ హౌజ్ కు శంకుస్దాపన చేశారు మంత్రి కేటీఆర్. వ‌రుస‌గా ఏడేండ్లు క‌రువు వ‌చ్చినా తాగునీటికి తిప్ప‌లు లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

హైద‌రాబాద్ చుట్టుతా కూడా వాట‌ర్ పైప్ లైన్‌ల‌ను ఏర్పాటు చేశారు. భ‌విష్య‌త్‌లో హైద‌రాబాద్ న‌గ‌రం 100 కిలోమీట‌ర్ల విస్త‌రించిన తాగునీటికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుప‌లా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామ‌న్నారు. విశ్వ నగరంగా హైదరాబాద్ ను తీర్చడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. హైదరాబాద్ ను తెలంగాణ కు మాత్రమే రాజధానిగా చూడొద్దు.. అంతర్జాతీయ సౌకర్యాలు ఉన్న నగరంగా.. దేశానికి ఒక దిక్సూచి గా హైదరాబాద్ అభివృద్ధి చెందాలి.. వందేళ్ల దార్శనికత కలిగిన నేత కేసీఆర్ హైదరాబాద్ లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు.