కెటిఆర్‌కు అరుదైన ఆహ్వానం


వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ప్రత్యేక అతిథిగా ప్రసంగించాలని విజ్ఞప్తి

ktr
ktr

హైదరాబాద్ : టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు మరో అరుదైన ఆహ్వానం అందింది. స్విట్జర్‌లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్లూఈఎఫ్) నుంచి ఆహ్వానం అంది ంది. వచ్చే సంవత్సరం జనవరి21 నుంచి 24వ తేదీవరకు జరగనున్న సమావేశాలకు ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించాలని డబ్లూఇఎఫ్ కోరింది. వరల్డ్‌ఎకనామిక్ ఫోరం 50వ సదస్సులో 4వ పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లపై ప్రసంగించాలని డబ్లూఇఎఫ్ ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెండె కెటిఆర్‌ను కోరుతూ ఆహ్వానం పంపారు. గత 50 సవత్సరాలుగా ప్రపంచంలోని ప్రైవేటు వ్యాపార, వాణిజ్య రంగంలోని ప్రముఖ సంస్థలతో ప్రభుత్వ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కీలక పాత్రపోషిస్తోంది.

2020లో జరగనున్న సమావేశానికి ప్రపంచంలోని కీలక సంస్థల ప్రతినిధులతోపాటు, ప్రభుత్వాధినేతలు, కేంద్రస్థాయి మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు అధ్యక్షుడు బోర్జ్ బ్రెండె కెటిఆర్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అనేక వినూతన కార్యక్రమాలు, పథకాలతో ముందుకు వెళ్లుతుందని, ఈజ్ ఆఫ్‌డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో అగ్రభాగాన ఉందని తెలిపారు. ప్రధానంగా టెక్నాలజీ రంగంలో మంత్రి కెటిఆర్ నాయకత్వంలో వినూతనంగా నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు ప్రపంచంలోని పలు దేశాల పెట్టుబడుదారులను ఆకట్టుకున్నాయని ఆయన ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/