మరో ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

minister-ktr-inaugurated-the-flyover

హైదరాబాద్ :మంత్రి కేటీఆర్ నగరంలోని బైరామల్‌గూడ జంక్షన్‌లో నిర్మించిన ఫ్లైఓవర్‌ను  సోమవారం ప్రారంభించారు. రూ. 26.45 కోట్ల అంచనాతో 784 మీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌రోడ్‌ జంక్షన్‌ల పరిధిలో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గనుంది. బైరామల్‌గూడ జంక్షన్‌లో రద్దీ వేళల్లో గంటకు 12 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌కు, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.  ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఫోటోలను కూడా కేటీఆర్ తిలకిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం గత కొన్ని రోజులుగా జరిగింది. దేశంలో మొదటిసారి ప్రత్యేక టెక్నాలజీని ఈ బ్రిడ్జి నిర్మాణంలో వినియోగించారు. ఈ ఫ్లైఓవర్‌తో బైరామల్‌గూడ జంక్షన్.. సాగర్ రోడ్ జంక్షన్‌పై ఒత్తిడి తగ్గనుంది. 

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/