బిజెపి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్

మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర తీరు ఫై , బిజెపి నేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడలో జాతీయ సమైక్యతా దినోత్సవ బహిరంగ సభ లో కేటీఆర్ మాట్లాడుతూ..భూమి కోసం, భుక్తి కోసం, తల్లి తెలంగాణ కోసం అమరుడైన ప్రతి వారిని గుర్తు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ పై దండయాత్ర కు కేంద్ర హోం మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తున్నారని.. మతం పేరిట చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వలేకపోతుందని ఆరోపించారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు పోటీగా బీజేపీ సభ ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తెలంగాణకు 10సార్లు వచ్చిన అమిత్ షా.. రాష్ట్రానికి ఒక్క రూపాయైనా తెచ్చారా అని నిలదీశారు. వేములవాడ రాజన్న ఆలయానికి కరీంనగర్ ఎంపీ ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. హిందూ ముస్లిం అనడమే తప్ప బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఏమన్నా తెచ్చాడా? అన్నారు. బీజేపీ వాళ్ళు అన్ని బోగస్ ముచ్చట్లు, బోగస్ కథలు చెబుతారని మండిపడ్డారు.

తెలంగాణ సాయుధ పోరాటములో మీ పాత్ర ఉందా? మీ నాయకుల పాత్ర ఉందా? అని ప్రశ్నించారు. స్వతంత్ర ఉద్యమంలో మా కుటుంబ పాత్ర ఉందని.. మా తాత నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఉన్నాడని పేర్కొన్నారు.