విద్యుత్తుశాఖ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం

బిఆర్ఎస్ ప్రభుత్వం టైములో రాష్ట్రంలో కరెంట్ పోయిందనేదే లేదు..కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో కరెంట్ అసలు వస్తుందా..? అనేవిధంగా తయారైంది. పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా సరిగా కరెంట్ ఉండడం లేదు. నిత్యం పవర్ కట్స్ తో ప్రజలకు నరకం చూపిస్తుంది. దీనికి కారణం రిపేర్లు అని చెపుతున్నారు. ఏవ్ రిపేర్లు బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఎందుకు రాలేదని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉచిత కరెంట్ అని చెప్పి..అసలు కరెంటే లేకుండా చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు , ప్రజలు ఎక్కడిక్కడే షబ్ స్టేషన్లను ముట్టడి చేస్తున్నారు.

ఒక మహిళ కరెంటు కోతలతో తనకు కలిగిన ఇబ్బందిని ఎక్స్‌ వేదికగా చెప్పడాన్ని విద్యుత్తు సిబ్బంది జీర్ణించుకోలేకపోయారు. ఆమె అడ్రస్‌ కనిపెట్టి ఇంటికి వెళ్లి మరీ బెదిరించారు. ‘ట్వీట్‌ తొలగిస్తారా? లేదా? తొలగించేదాకా ఇక్కడి నుంచి కదిలేదిలేదు.. పైనుంచి మాకు ఒత్తిడి ఉన్నది’ అని భయపెట్టారు. అసలే మహిళ.. ఆపై అద్దె ఇల్లు. చేసేదిలేక ట్వీట్‌ను తొలగించింది. ఈ విషయాన్ని కూడా ఎక్స్‌లో మళ్లీ పోస్టు చేసింది. ‘ఎలాంటి ప్రభుత్వం ఇది..?!’ (వాట్‌ కైండ్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఈజ్‌ దిస్‌) అంటూ అసహనం వ్యక్తంచేసింది. ఈ అంశాన్ని మహిళా జర్నలిస్టు రేవతి రీ ట్వీట్‌ చేస్తూ విద్యుత్తుశాఖ తీరుపై మండిపడ్డారు. ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడిది? అనే రీతిలో అధికార యంత్రాంగం ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ పరిణామాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా స్పందించారు. ‘విద్యుత్తు సరఫరాకు సంబంధించి పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తిన జర్నలిస్టుపైనే పోలీసులు బెదిరింపులకు పాల్పడతారా? రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు షాక్‌నిచ్చేలా ఉన్నాయి. అసలు మీకు ఏమి హక్కు ఉన్నదని విద్యుత్తు సమస్యలపై ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తారు’ అని ఎక్స్‌ వేదికగా నిలదీశారు. పోలీస్‌శాఖ ఏమైనా విద్యుత్తు శాఖను సైతం నడుపుతుందా? సోషల్‌ మీడియాలో ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తితే వారిపై మీరు కేసులు పెడతారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి తెలంగాణ డీజీపీ, రాచకొండ పోలీసులు సమాధానం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Shocking State of affairs in Telangana

What right has the @TelanganaCOPs got to intrude and issue veiled threats to a journalist who raised a genuine concern about citizens plight with respect to Electricity ?

Is the police department running Energy department or is it just… https://t.co/PTRWrfehTO— KTR (@KTRBRS) June 18, 2024