బలం ఉన్న పార్టీలే తమ ఆధిక్యతను చూపుతాయి

ktr
ktr

నల్గొండ: నల్గొండలోని క్లాక్‌టవర్‌ వద్ద ఏర్పాటు చేసిని ఎన్నికల ప్రచార రోడ్‌షోలో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడతు ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన మొనగాడు కెసిఆర్‌ అలాంటిది 16 మంది నేతలను ఇస్తే ఏం చేస్తారో ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు. ఎరక్రోటపై బిజెపియేతర, కాంగ్రెస్‌తర ప్రభుత్వమే జెండా ఎగురవేయబోతుందని జోస్యం చెప్పారు.కేంద్రంలో బలం కలిగిన పార్టీలే తమ ఆధిక్యతను ప్రదర్శిస్తాయన్నారు. మా నిధులు మాకెందుకు ఇవ్వరని నిలదీయడమే కాకుండా అవసరమైతే గల్లా పట్టి కేంద్రాన్ని అడిగే దమ్మున్న పార్టీ టిఆర్‌ఎస్‌ మాత్రమేనన్నారు. కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలంతా ఢిల్లీ దర్బారులో గులాములని విమర్శించారు. వారంతా రాహుల్‌ గాంధీ, మోదీ ఏం చెబితే అదే వింటారని కేటీఆర్‌ ఆరోపించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/