కేటీఆర్ దావోస్ టూర్ గ్రాండ్ సక్సెస్..రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చిందంటే..

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ మరోసారి రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా జ‌రిగిన 2023 ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ టూర్ లో మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి ఏకంగా రూ. 21 వేల కోట్ల పెట్టుబ‌డులు తీసుకొచ్చారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా జ‌రిగిన 2023 ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సు ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైంద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 4 రోజుల్లో 52 వాణిజ్య‌, 6 రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 2 ప్యానెల్ చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ మొత్తం టూర్ లో తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబ‌డులు వచ్చినట్లు తెలిపారు.

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబ‌డితో హైద‌రాబాద్‌లో మ‌రో 3 డాటా సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు దావోస్ వేదిక‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గ్లోబ‌ల్ మ‌ల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్‌స్పైర్ బ్రాండ్స్ హైద‌రాబాద్‌లో త‌మ స‌పోర్ట్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. కేటీఆర్ టూర్ సక్సెస్ కావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క్కరు అభినందిస్తున్నారు. కేవలం తెలంగాణ మాత్రమే కాదు పక్కనున్న ఏపీ వారు సైతం కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ…ఆ రాష్ట్ర మంత్రుల ఫై , ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారు.