బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫై పెట్టిన కేసు ఫై కేటీఆర్ ఆగ్రహం

ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పైన పోలీసులు పెట్టిన అక్రమ కేసును ట్విట్టర్ వేదికగా బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తుందని కేటీఆర్ మండిప‌డ్డారు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పైన ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసు నమోదు చేయడం స‌రికాద‌న్నారు.

స్థానిక ఎమ్మెల్యేకు సరైన గౌరవం, ప్రోటోకాల్ ఇవ్వకుండా అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరికి నిరసన తెలిపినందుకు పోలీసులు, ఎమ్మెల్యే పైనే ఏకపక్షంగా కేసు నమోదు చేయడం అక్రమం అన్నారు. పోటీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా,ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు.