హెచ్‌సీఏలో అవినీతిపై కెటిఆర్‌కు ఫిర్యాదు

Ambati Rayudu
Ambati Rayudu

హైదరాబాద్‌: (హెచ్‌సీఏ) హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో అవినీతిపై టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ సంఘంలో అవినీతిని కట్టడి చేయాలని తెలంగాణ పారిశ్రామిక, పట్టణాభివృద్ధి మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. క్రికెట్‌ పాలకులలో చాలామందిపై ఏసీబీ కేసులు నడుస్తోంటే రాష్ట్రంలో క్రికెట్‌ ఎలా ఎదుగుతుంని అంబటి రాయుడు ప్రశ్నించారు. హల్లో..కెటిఆర్‌ సర్‌. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతి వైపు దృష్టిసారించాలని, దానిని నిర్మూలించాలని కోరుతున్నా. అవినితీ పాలకులు క్రికెట్‌ జట్టుపై ప్రభావం చూపిస్తుంటే మన హైదరాబాద్‌ క్రికెట్‌ గొప్పతనం ఎలా తెలుస్తుంది. పాలకులపై కుప్పలు తెప్పలుగా ఏసీబీ కేసులున్నాయి. వాటిని దాచి పెట్టారు. అని కేటీఆర్‌కు అంబటి రాయుడు ట్వీట్‌ చేశారు. కాగా ఈ మధ్యే జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ ప్యానెల్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు అవినీతిపై ఆరోపణలు చేయటం ప్రాధ్యాన్యత సంతరించుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/