ట్విట్ట‌ర్‌లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని బ్లాక్ చేసిన మంత్రి కేటీఆర్‌

ట్విట్టర్ లో నిత్యం యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్..మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని తన ట్విట్టర్ లో బ్లాక్ చేసాడట. ఈ విషయాన్నీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తో ఎంతో అనుబంధం ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక పార్టీ ని విడి బిజెపి లో చేరిన సంగతి తెలిసిందే. అంతే కాదు తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసాడు. దీంతో ఇప్పుడుమునుగోడు కు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఈ ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి బరిలోకి దిగుతుండగా, బిజెపి నుండి రాజగోపాల్ రెడ్డి దిగుతున్నారు. టిఆర్ఎస్ నుండి ఎవరు అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మూడు పార్టీ లు మునుగోడు లో ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఈ తరుణంలో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్..రాజగోపాల్ రెడ్డి ని తన ట్విట్టర్ లో బ్లాక్ చేసాడట. ఈ విష‌యాన్ని రాజగోపాల్ రెడ్డి శుక్ర‌వారం రాత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గానే వెల్ల‌డించారు. కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఆయ‌న చేసే ట్వీట్లు ఇక రాజ‌గోపాల్ రెడ్డికి క‌నిపించ‌వు. కేటీఆర్ చ‌ర్య‌పై కోమ‌టిరెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ద్రోహుల జాడ చెప్ప‌లేక భ‌య‌ప‌డి త‌న‌ను కేటీఆర్ బ్లాక్ చేశారంటూ ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌ ద్రోహులు ఇచ్చిన కానుక‌లు స్వీక‌రించి వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన మీరు… వారికి భ‌య‌ప‌డ‌కుండా ఎందుకు ఉంటారని కూడా కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు. చివరికి టీఆర్ఎస్ ఉద్య‌మ ద్రోహుల‌తో నిండిపోయింద‌ని ఒప్పుకున్నందుకు కృత‌జ్ఞ‌తలు అంటూ రాజ‌గోపాల్ రెడ్డి మ‌రో కామెంట్ చేశారు.