బ‌యో టెక్నాల‌జీ రంగంలో స్టార్ట‌ప్‌ల‌కు మంచి అవ‌కాశాలు..కెటిఆర్‌

వైద్య రంగంలో కృత్రిమ మేధది కీల‌క పాత్ర.. స‌త్యనాదెళ్ల‌

హైదరాబాద్‌: రెండో రోజు బయో ఆసియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో వర్చువల్‌గా జరిగిన చర్చావేదికలో మంత్రి కెటిఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ.. బ‌యో టెక్నాల‌జీ రంగంలో స్టార్ట‌ప్‌ల‌కు మంచి అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. అయితే, వైద్య రంగంలో డేటా భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యత‌ ఇవ్వాలని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా స‌త్య‌నాదెళ్ల స్పందిస్తూ.. బ‌యో ఆసియా స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌శంసించారు. వైద్య రంగంలో కృత్రిమ మేధ కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని తెలిపారు. ఇన్‌పేషెంట్ సేవ‌ల విభాగంలోనూ కృత్రిమ మేధ‌ది కీల‌క పాత్ర అని స‌త్యనాదెళ్ల చెప్పారు. త‌క్కువ ఖ‌ర్చుతో వైద్య సేవ‌లు అందించే ల‌క్ష్యంతో మేము ప‌ని చేస్తున్నామ‌ని స‌త్య‌నాదెళ్ల తెలిపారు.


కాగా, హైద‌రాబాద్ వేదికగా ప్ర‌తిష్ఠాత్మ‌క ఆసియా అంతర్జాతీయ సదస్సు2021 కొన‌సాగుతోంది. కరోనా పరిస్థితుల నేప‌థ్యంలో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తోన్న ఈ సద‌స్సులో ప్రపంచంలోని 30 వేల మందికి పైగా జీవశాస్త్రాల నిపుణులు వారి దేశాల నుంచి హాజ‌ర‌వుతున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/