కర్నాడ్‌ మృతికి 3 రోజులు సంతాపదినాలు

ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

girish karnad
girish karnad

బెంగళూరు: ప్రముఖ సినీనటుడు, రచయిత గిరీశ్‌ కర్నాడ్‌ మృతి పట్ల కర్ణాటక సియం కుమార స్వామి సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి సంతాపంగా ఒక రోజు సెలవు, మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు సియం కుమారస్వామి. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
టీవి ప్రేక్షకులకు మాత్రం గిరీశ్‌ మరీ ప్రత్యేకంగా కనిపిస్తారు. మాల్గుడిడేస్‌, ఇంద్రధనుష్‌ లాంటి సీరియళ్లలో గిరీశ్‌ నటించారు. గత ఏడాది విడుదలైన టైగర్‌ జిందా హై హిందీ సినిమాలో గిరీశ్‌ చివరిసారి కనిపించారు. ఆయనకు అనేక చిత్రాలకు జాతీయ ఫిల్మ్‌ అవార్డులను స్వీకరించారు. కర్నాడ్‌ మృతిపట్ల ప్రధాని మోది నివాళి అర్పించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/