రేఖా శర్మ ట్వీట్‌పై స్పందించిన కెటిఆర్‌

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రేఖా శర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ ఘాటుగానే స్పందించారు. కొన్ని ఛానల్లలో ప్రసారమైన చర్చ కార్యక్రమం ఆధారంగా తెలంగాణ సిఎంఒ మహిళలు రాత్రి 8 గంటల్లోగా ఇంట్లో ఉండాలనే ప్రకటన చేశారని, మహిళలు అలా చేస్తే నేరాలు జరగవా? అని ఆమె చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ తెలంగాణ సిఎంఒ ఎలాంటి ప్రకటన చేయలేదని కెటిఆర్‌ స్పష్టం చేశారు. బాధ్యతలేని కొన్ని ఛానళ్లు ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారని కెటిఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కీలకమైన పదవిలో ఉన్న రేఖా శర్మ నిజాలు తెలసుకుని మాట్లాడాలని ఆమెను ఉద్దేశించి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ktr-responded-to-rekha-sharmas-tweet

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/