జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం

హైదరాబాద్: జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం అయ్యింది. ఈ నెల 14 నుంచి గెజిట్ అమలులోకి రానుండడంతో బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. జల విద్యుత్‌ని బోర్డు పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణపై ఉన్న విద్యుత్ పంప్ హౌస్‌లను బోర్డు పరిధిలోకి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. విద్యుత్ పేరిట నీటిని శ్రీశైలం నుంచి తెలంగాణ దిగువకు విడుదల చేస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. ఈ సమావేశానికి బోర్డు ఛైర్మన్‌తోపాటు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/