స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.!

ఐసోలేషన్ లో కృతిసనన్

Krithisanon in Isolation
Krithisanon in Isolation

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో “1 నేనొక్కడినే” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కృతి సనన్.

ఈ టాల్ హీరోయిన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స్థిరపడింది.

అయితే ఇప్పుడు ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. సినిమా రంగంలో కూడా తీరని నష్టాన్ని మిగిలిచ్చిన కరోనా నెమ్మదిస్తునే మరింతమంది ప్రముఖులకు సంక్రమిస్తూ వస్తుంది.

ఇటీవలే బాలీవుడ్ లో ప్రముఖ హీరో వరుణ్ ధావన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది అని విన్నాము.

ఇప్పుడు ఈ ఒక్కరోజు గ్యాప్ లోనే ఈమెకు పాజిటివ్ రిపోర్ట్స్ రావడం బాలీవుడ్ వర్గాల్లో మరింత ఆందోళన కల్గిస్తోంది.

ప్రస్తుతం ఆమె ఓ సినిమా షూట్ లో పాల్గొనగా అక్కడ నుంచి ఆమెకు కోవిడ్ వైరస్ సోకినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఐసోలేషన్ లో వుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/