ఉప్పెన బ్యూటీకి ఛాన్స్ అందుకే రావడం లేదా..?

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కి రోజు రోజుకు ఛాన్సులు లేకుండా పోవడానికి కారణం ఆమె అందాల ఆరబోతకు దూరంగా ఉండడమేనా.? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. ఉప్పెన మూవీ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కృతి..ఆ తర్వాత బంగార్రాజు , శ్యామ్ సింగ రాయ్ మూవీస్ తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి వరుస ఛాన్సులు కొట్టేసింది. కానీ ఆ చిత్రాలన్నీ భారీ డిజాస్టర్స్ కావడం తో అమ్మడికి ఛాన్సులు లేకుండా పోతున్నాయి. మొన్నటికి మొన్న నాగ చైతన్య తో కస్టడీ మూవీ చేసింది. ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నప్పటికీ ఆ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. ఈమె కంటే వెనుక వచ్చిన శ్రీ లీల వరుస అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన జోడి కడుతూ మిగతా హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

కాగా కృతి శెట్టి కి ఛాన్సులు రాకుండా పోవడానికి కారణం..ఇంతవరకూ వచ్చిన ఫ్లాపులు కాదనే టాక్ వినిపిస్తోంది. కథకి తగినట్టుగా .. ఆడియన్స్ కోరుకునే విధంగా గ్లామర్ పరంగా డోస్ పెంచడానికి కృతి ఎంత మాత్రం ఒప్పుకోకపోవడమే ప్రధానమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కృతి ఎలాంటి వంకా పెట్టలేని బ్యూటీ .. యూత్ లో ఆమె క్రేజ్ కూడా ఎంతమాత్రం తగ్గలేదు. అలాంటి ఈ సుందరికి ఛాన్సులు తగ్గడానికి ఇదే కారణమని అంటున్నారు.