కస్టడీ నుండి కృతి శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్

నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ కస్టడీ. ఇప్పటికే ఈ సినిమాలోని నాగ చైతన్య లుక్ రిలీజ్ చేసి ఆసక్తి నింపిన మేకర్స్..ఈరోజు బుధువారం చిత్రంలోని కృతి శెట్టి తాలూకా లుక్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ మూవీ లో కృతి ‘రేవతి’ పాత్రను పోషిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్ లో రేవతి ఆందోళన .. ఆవేదనకి లోనైనట్టుగా కనిపిస్తోంది. అందుకు కారణం ఏమై ఉంటుందనే ఒక ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశారు.

ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ‘బంగార్రాజు’ తరువాత చైతూ – కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీ ఫై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ మూవీ ఈ ఇద్దరికీ చాల కీలకంగా మారింది. వీరిద్దరూ ప్రస్తుతం వరుస ప్లాప్స్ లో ఉన్నారు. దీంతో ఈ మూవీ ఫైనే వారితో పాటు , అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో మే 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.