క్రిష్,పవన్ కళ్యాణ్ సినిమా ముహూర్తం ఫిక్స్!

Krish-pawan kalyan

సినిమాల్లో నటిస్తాడో లేదో అనుకున్న పవన్ వరుసగా చిత్రాలు చేసేందుకు సిద్దం అయ్యారు
ప్రస్తుతం తన 26వ చిత్రంగా ‘పింక్’ రీమేక్ ను చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. నిన్న పవన్ షూటింగ్ కు హాజరు అయ్యారు. ఆ ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. ఇక పవన్ తదుపరి చిత్రం గురించిన ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో ఏఎం రత్నం నిర్మాణం లో పవన్ తన 27వ చిత్రాన్ని చేయబోతున్నారట. పవన్ 27వ చిత్రంను ఈనెల 27న లాంచనంగా ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వం లో పవన్ మూవీ అంటూ చాలా రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా డేట్ కూడా వచ్చేసింది. దాంతో సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవన్ 27వ చిత్రం అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వస్తుందని ఒక ప్రముఖ పీఆర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/