అందరి నోటా ‘కృష్ణపట్నం ఆనందయ్య’ !

కరోనా ఆయుర్వేద మందు కోసం నెల్లూరు జిల్లా కు దూసుకొస్తున్న జన ప్రవాహం

Nellore District: కృష్ణపట్నం పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతూ ఉంది. . ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు ఆయన ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు బొరిగి ఆనందయ్య . ఆయుర్వేదంపై ఆయనకు ఉన్న పట్టుతో ఓ మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు అక్కడ మందు పంపిణీని నిలిపివేశారు

.మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. దీంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు కూడా. ఈ మందు కోసం ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వేలాది గా తరలి వచ్చారు.

ఎవరీ ఆనందయ్య..

సేకరించిన వివరాల ప్రకారం ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంకు చెందిన ఆనంద్ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ. భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామి శిష్యుడు, గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం చేశారు. ఆ సమయంలో ఆయుర్వేద మందులపై పట్టు సాధించారు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతోపాటు పలువురు మేధావుల నుంచి సలహాలు కూడా తీసుకున్నారు. కరోనాను కట్టడి చేసే మందును తయారు చేసి ముందుగా కృష్ణపట్నం గ్రామ ప్రజలకు అందించారు.

వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం..

కృష్ణపట్నంలో కరోనా మందు తయారీదారుడి పేరు బొరిగి ఆనందయ్య. ఈ కుటుంబం వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నాడు. దీని కోసం మొదట్లో పదుల సంఖ్యలో జనం వచ్చేవారు. ఇప్పుడు రోజుకు 4-5వేలకు పైగా ప్రజలు తమ గ్రామానికి వస్తున్నారని గ్రామస్తులు తెలిపారు

‘‘కృష్ణపట్నం కరోనా మందు..’’ కొవిడ్‌ రోగుల పాలిట ఒకింత దివ్వఔషధంగా మారింది. కరోనా రాని వారికి కూడా వైరస్‌ సోకుకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ కుదిపేస్తున్న వేళ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇపుడు ఇదే చర్చ! ఈ మందుపై చాలా మందిలో ఏదో తెలియని ఆశ కలిగింది. .

ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ‘కృష్ణపట్నం ఆయుర్వేద మందు’ కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. అయితే శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం ఆయుష్‌ ల్యాబ్‌కు పంపింది. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కృష్ణపట్నం కరోనా మందుని పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించడం ఆసక్తి రేకెత్తించింది. 

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/