నేటి సాయంత్రానికి జూరాలకు చేరనున్నకృష్ణమ్మ

jurala project
jurala project

హైదరాబాద్: బిర బిరా కృష్ణమ్మ తెలంగాణ వైపు పరుగులు పెడుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. నారాయణపూర్ నుంచి 10 వేల క్యూసెక్కులతో మొదలుపెట్టి అర్థ రాత్రి వరకు లక్ష క్యూసెక్కులకు అవుట్‌ఫ్లోను పెంచారు. ఆల్మట్టికి 71 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు 101800 వేల క్యూసెక్కులు వదులుతున్నాయి. ఇదేవిధంగా నారాయణపూర్‌కు ఆల్మట్టి అవుట్‌ఫ్లోతో పాటు స్థానిక వర్షాల కారణంగా వరద భారీగా వస్తుంది. ఆదివారం ఉదయం 10,000 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో లక్ష వరకు పెరుగుతుందని అధికారులు తెలిపారు. 9 గంటల సమయంలో ఇన్‌ఫ్లో 71 వేలుగా ఉంది. దీంతో నారాయణపూర్ నుంచి లక్ష క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి విడుదల చేసిన నీరు ఇంకా జూరాలకు పూర్తిస్థాయిలో చేరడానికి 24 గంటలకు పైగా పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జూరాలకు ఇన్‌ఫ్లో తక్కువగానే ఉన్నా, క్రమంగా పెరుగనుంది. మరో వైపు తుంగభద్ర, భీమా నదిపై ఉజ్జయిని డ్యాంలకు సైతం ఇన్‌ఫ్లోలు పెరిగాయి.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/