తెలంగాణకు 59, ఎపికి 152 టిఎంసిలు

Krishna Water Disputes
Krishna Water Disputes

కృష్ణ యాజమాన్య బోర్డు నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణకు 59 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 152 టిఎంసిలు కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వినియోగించిన నీటితో కలిపి సెప్టెంబరు నెలాఖరు వరకు ఈ నీటిని వినియోగించాలని బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చారు. శ్రీశైలంలో కనీస నీటిమట్టానికి (834 అడుగులు) ఎగువన 128.3 టిఎంసిలు, నాగార్జునసాగర్‌లో కనీస నీటిమట్టం (510 అడుగులు) పైన 129.1 టిఎంసిలు, మొత్తం గా ప్రస్తుతం 257.5 టిఎంసిల నీటి లభ్యత ఉందని కృష్ణా బోర్డు తేల్చింది. అయితే శ్రీశైలం నుంచి తెలంగాణకు కల్వకుర్తి ఎత్తిపోతల అవసరాలకు గాను 14.5 టిఎంసిలు కేటాయించారు. నాగార్జునసాగర్ నుంచి సాగర్ ఎడమ కాలువకు 26.06 టిఎంసి, ఎఎంఆర్‌పికి 10.47 టిఎంసిలు, హైదరాబాద్ తాగునీటికి 5.90 టిఎంసి, మిషన్ భగీరథ అవసరాలకు 2.08 టిఎంసిల నీటిని, మొత్తంగా రాష్ట్రానికి సాగర్ నుంచి 44.51 టిఎంసిలు వినియోగించాలని బోర్డు సూచించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/