కృష్ణ వ్రింద విహారి మూవీ టాక్ ..

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. షిర్లీ సేటియా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మరి గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ శౌర్య కు ఈ మూవీ ఎంత మేరకు కలిసి వచ్చింది..ప్రేక్షకులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

యూఎస్‌లో ప్రీమియర్స్ షోస్ చూసిన సినీ లవర్స్ ట్విట్టర్ వేదికగా సినిమా ఎలా ఉందనేది పంచుకుంటున్నారు. కృష్ణ వ్రింద విహారి మూవీ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని అంటున్నారు. స్టోరీ తెలిసినదే అయినా.. స్క్రీన్ ప్లే బాగుందంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కథను ములుపు తిప్పుతుందట. నాగశౌర్య ఎప్పటిలాగే కూల్ వైబ్‌తో ఆకట్టుకున్నాడని.. హీరోయిన్ షిర్లీ సెటియా తెరపై చాలా అందంగా కనిపించిందంటున్నారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ బాగున్నాయని.. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్కట్ అయిందని చెపుతున్నారు. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ పెద్దగా లేదని మరికొంతమంది చెబుతున్నారు. నాగశౌర్య గత నాలుగైదు సినిమాలకంటే ఈ మూవీ చాలా బాగుందంటున్నారు.

అనీష్‌ కృష్ణ టేకింగ్‌తో తన మార్క్ చూపించాడని , మహతి స్వర సాగర్‌ మ్యూజిక్ కూడా చాలా బాగుందని, ఓవరాల్‌గా కృష్ణ వ్రింద విహారి మూవీకి పాజిటివ్ టాక్ అయితే చెపుతున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషించారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య, తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర సంగీతం అందిస్తున్నారు.