కృష్ణ వ్రిందా విహారి రెండు రోజుల కలెక్షన్స్

నాగ శౌర్య నటించిన కృష్ణ వ్రిందా విహారి మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆర్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. షిర్లీ సేటియా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ శౌర్య కు ఈ మూవీ మళ్లీ ఊపిరిని పోసిందనే చెప్పాలి. ఇక టాక్ బాగుండడం తో ప్రేక్షకులు సినిమాను చూసేందుకు థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది.

2 రోజుల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే.. నైజాంలో రూ. 76 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి రూ. 1.62 కోట్లు షేర్, రూ. 2.70 కోట్లు గ్రాస్ వసూలైంది.