మోడీకి కేపీ శర్మఒలీ ఫోన్

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నేపాల్ ప్రధాని

KP Sharmaoli- Modi
KP Sharmaoli- Modi

New Delhi: నేపాల్‌ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి   ప్రధాని నరేంద్ర వెూడీకి ఫోన్‌చేసి 74వ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.

అదే విధంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అభినందనలు కూడా తెలిపారు.

గత కొన్ని రోజులుగా సరిహద్దు  విషయంలో నెలకొన్న వివాదం గురించి మాత్రం ప్రస్తావించలేదు. 

భారత స్వాతంత్య దినోత్సవం సందర్భంగా భారత్‌లో చైనా రాయబారి సన్‌ వెడాంగ్‌ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం: https://www.vaartha.com/specials/career/