”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల

”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” చిత్రం నుండి కొత్త కొత్తగా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసారు మేకర్స్. హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా స్టిల్స్ , వీడియోస్ ఆకట్టుకోగా..తాజాగా చిత్రంలోని కొత్తకొత్తగా అనే సాంగ్ ను విడుదల చేసారు.

నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రామకృష్ణ, తలైవాసల్ విజయ్, వడ్లమాని శ్రీనివాస్, గోపరాజు రమణ, కళ్యాణి నటరాజన్, ప్రేమ్ సాగర్, విశ్వంత్ దుద్దుపూడి, కునాల్ కౌశిక్ తదితరులు.