కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు

  • గతంలో ఢిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ
Feroz Shah Kotla Stadium
Feroz Shah Kotla Stadium

న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన దివంగత అరుణ్ జైట్లీకి తగిన గౌరవం ఇవ్వాలని ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నిర్ణయించింది. ఢిల్లీలోని ప్రఖ్యాత ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని డీడీసీఏ నిశ్చయించుకుంది. ఇకమీదట ఢిల్లీ స్టేడియాన్ని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా పిలవనున్నారు. ఈ మేరకు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మీడియాకు తెలిపారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో జైట్లీ చేసిన కృషి అసామాన్యమని, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, రిషబ్ పంత్ వంటి అనేకమంది క్రికెటర్లు జైట్లీ సపోర్ట్ తో భారతదేశం గర్వించేలా ప్రదర్శన చేశారని, చేస్తున్నారని శర్మ పేర్కొన్నారు. అంతటి గొప్పవ్యక్తికి ఇది తగిన గౌరవంగా భావిస్తున్నామని వెల్లడించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/