బిజెపిలో చేరిన మాజీ ఎంపి కొత్తపల్లి గీత

Kothapalli Geetha
Kothapalli Geetha, former mp

న్యూఢిల్లీ: ఏపిలోని అరకు మాజీ ఎంపి కొత్తపల్లి గీత ఇవాళ భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు. ఆమె బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. గతేడాది స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బిజెపిలో విలీనం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పార్టీ అధిష్టానం తనకు ఏ పదవి, బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి నుంచి అరకులోయ ఎంపిగా గెలుపొందిన గీత ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/