టీడీపీ లో చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు

ఏపీలో మళ్లీ టీడీపీ పుంజుకుంటుంది. టీడీపీ ని వీడి ఇతర పార్టీల్లో చేరిన నేతలంతా మళ్లీ సొంతగూటికి వస్తున్నారు. అలాగే మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా నేతలు సైతం యాక్టివ్ అవుతున్నారు. రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో , పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం తో కార్య కర్తల్లోనూ ఉత్సహం రెట్టింపు అవుతుంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు టీడీపీ కండువా కప్పుకోగా..శుక్రవారం వైస్సార్సీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీ లో చేరారు.

చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కొన్ని రోజుల క్రితం కోటంరెడ్డి వైస్సార్సీపీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. తనపై సొంత పార్టీ వాళ్లే నిఘా పెట్టారని, అలాగే తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారని, నమ్మకం లేని చోట ఉండలేనని చెప్పి కోటంరెడ్డి పార్టీ నుంచి బయటకొచ్చారు. అప్పటినుంచి ఆయన అధికార పార్టీ ఫై పోరాటం చేస్తున్నారు. అలాగే ఆయన టి‌డి‌పిలో చేరతానని చెప్పారు. కాకపోతే వైస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన డైరక్ట్ గా టి‌డి‌పిలో చేరలేదు. దీంతో ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిని టీడీపీ లోకి పంపించారు. ఎన్నికల ముందు కోటంరెడ్డి టీడీపీ వచ్చి..నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక కోటంరెడ్డి రాకతో నెల్లూరులో టీడీపీ కి కొత్త కళ వచ్చింది. పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే మరికొద్ది రోజుల్లో మరికొంతమంది కీలక నేతలు టీడీపీ లో చేరబోతున్నట్లు సమాచారం.