సెట్ లో చిరంజీవి ఆలా ఉండేవారు అంటూ ఆసక్తికర విషయాలు తెలిపిన కొరటాల

రైటర్ గా సినీ కెరియర్ మొదలు పెట్టిన కొరటాల శివ..మిర్చి మూవీ తో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొన్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య మూవీ చేసాడు. ఈ మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర చేయడంతో ఈ మూవీ ఫై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమంలో బిజీ బిజీ గా ఉన్నారు. తాజాగా కొరటాల మాట్లాడుతూ సెట్ లో చిరంజీవి తీరు గురించి చెప్పి ఆశ్చర్య పరిచారు.

“చిరంజీవిగారికి సెట్ అంటే ఇష్టం. ఆయన సీనియర్ ఆర్టిస్ట్ గనుక, ఆయనకి గం. 4.40కి పేకప్ చెప్పేవాడిని. మిగతా వాళ్లందరినీ గం. 6:40కి పంపించేవాడిని. కానీ చిరంజీవిగారు అక్కడి నుంచి వెళ్లేవారు కాదు. అలా టీ తాగుతూ అక్కడే కూర్చునేవారు. అందరికీ పేకప్ చెప్పిన తరువాతనే ఆయన వెళ్లేవారు.

సెట్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం .. లైట్స్ .. సౌండ్ .. యాక్షన్ .. కట్ అనేవి ఆయనకి ఎంతో ఇష్టం. సెట్ కి ఎవరైనా వస్తానంటే వాళ్ల కోసం ఎంతో ఓపికగా వెయిట్ చేసేవారు. వాళ్లతో సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఇంటి దగ్గర కన్నా సెట్లో ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు” అని చెప్పుకొచ్చారు.