కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 58

కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 58కి చేరింది. కొండగట్టు వద్ద నిన్న జరిగిన బస్సు ప్రమాదంలో కొందరు ఘటన స్థలంలో చనిపోగా, మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జగత్యాల, హైదరాబాద్ ఆస్పత్రుల్లో 44 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
మృతుల్లో 38 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో అత్యధికంగా శనివారంపేట, దుబ్బ తిమ్మాయిపల్లి, హిమ్మత్రావుపేట, రాంసాగర్, తిరుమలాపూర్ వాసులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారు.
మృతుల కుటుంబీకుల రోధనలతో జగిత్యాల ఆస్పత్రి దద్దరిల్లింది. దేశ చరిత్రలోనే కొండగట్టు బస్సు ప్రమాదం అతిపెద్ద బస్సు ప్రమాదంగా నిలిచింది.