బీజేపీలో చేరేదానిపై కొండా మురళి క్లారిటీ ..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నేతల వలసలు నడుస్తున్నాయి. అధికార పార్టీ తో పాటు కాంగ్రెస్ , బిజెపి పార్టీల్లోకి అటు , ఇటు జంప్ చేస్తున్నారు. ముఖ్యముగా టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలనుండి పెద్ద ఎత్తున నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో కొండా మురళి దంపతులు కూడా త్వరలో బిజెపి లోకి చేరబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. దీంతో చాలామంది నిజమే కావొచ్చని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో కొండా మురళి ఈ వార్తలను ఖండించారు.

తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని కొండా మురళి స్పష్టం చేశారు. అక్కడితో ఆగకుండా.. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశిస్తే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై పాలకుర్తిలో పోటీ చేస్తానని కొండా మురళి వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఓరుగల్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కొండా మురళి పక్కా వ్యూహంతో ఈ కామెంట్స్ చేశారని చర్చ జరుగుతోంది. ఎర్రబెల్లికి రాజకీయ ప్రత్యర్థి అయిన కొండా మురళిని పాలకుర్తి నుంచి పోటీ చేయించే వ్యూహంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ దయాకర్ రావు, కొండా మురళి నేరుగా తలపడిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కొండా మురళి చేసిన తాజాకామెంట్స్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.