బడ్జెట్‌పై విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy

హైదరాబాద్‌: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే బడ్జెట్‌లో అన్యాయం జరిగిందన్నారు. రైతుల గురించి కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాల ప్రస్తావన లేదన్నారు. కేంద్ర బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్‌గా కోమటిరెడ్డి అభివర్ణించారు. గత ఐదేళ్లు సిఎం కెసిఆర్‌, ప్రధాని మోడి భజన చేశారని.. అయినా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని కోమటిరెడ్డి విమర్శించారు.గిరిజన విశ్వవిద్యాలయం, గేమ్స్‌కు నిధులు కేటాయించలేదని, కాళేశ్వరానికి జాతీయ హోదా, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదుని ఎంపీ కోమటిరెడ్డి విమర్శించారు. వ్యక్తిగత కారణాలవల్లనే సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆయన ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం దారుణమన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/