షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున నిల్చున్న అభ్యర్థిని కాదని తన తమ్ముడికి ఓటు వేయాలని కోరడం, మునుగోడు లో కాంగ్రెస్ గెలవదని చెప్పడం పట్ల ఆయనపై అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరింది.

వెంకటరెడ్డికి ఏఐసీసీ గత నెల 22న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది. ఆయనకు ఇచ్చిన గడువు నవంబర్ 1తో ముగియగా… వెంకటరెడ్డి తనకు నోటీసులు అందలేదని చెప్పడంతో.. మరోసారి షోకాజ్ నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలోనే షోకాజ్ నోటీసులకు వెంకటరెడ్డి సమాధానం ఇచ్చినట్లు తాగాగా వెలుగులోకి వచ్చింది. తన తమ్ముడికి ఓటేయాలని తాను కోరినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో తనది కాదని, అది నకిలీదని సీల్డ్ కవర్‌లో వెంకటరెడ్డి ఏఐసీసీకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంటరెడ్డి షోకాజ్ నోటీసులకు సమాధానం ఇస్తారా? లేదా? అనేది ఉత్కంఠ రేపింది. కానీ ఇప్పుడు ఆయన వివరణ ఇవ్వడంతో ఆ సస్పెన్స్‌గా తెరపడింది.